మా ఓటు భారత్ కే అంటున్న జపాన్

SMTV Desk 2017-08-18 11:24:37  Japan, India, Doklam border, border issue

జపాన్, ఆగస్ట్ 18: చైనా భారత్ పై సమరానికి సై అంటే మేము భారత్ వెంటే ఉంటామని అమెరికా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జపాన్ ఈ పరిస్థితులపై స్పందిస్తూ మా దేశం భారత్ వెన్నంటే ఉంటుంది అని స్పష్టం చేసింది. జపాన్ దౌత్యాధికారి కెన్జీ హిరామత్సు మాట్లాడుతూ... సిక్కిం - టిబెట్ - భూటాన్ ట్రై జంక్షన్ ప్రాంతమైన డోక్లామ్ లో ఉన్న ఇరు దేశాల సైన్యాలు సంయమనంతో ఉండాలి. ఆ ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు రెండు దేశాల సైన్యాలు ఒకేసారి తిరిగి వెళ్లాలని ఆయన పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో చైనా రహదారి నిర్మించాలను కోవడం సరియైన నిర్ణయం కాదని తెలిపారు. ఇరు దేశాల మధ్య పరిస్థితులు విషమించి యుద్ధం అనివార్యమైతే తాము ఇండియాతో ఉంటామని ఆయన ప్రకటించారు. సమస్య పరిష్కార దిశగా ఇరు దేశాలు చర్చలు జరపాలని ఆయన ఆకాంక్షించారు. భారత్‌కి భూటాన్‌తో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాల నేపధ్యంలో ఇండియా ఇలా నడచుకుంటుందని ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందాలే ప్రధానమంటూ వ్యాఖ్యానించారు. తాజా జపాన్ నిర్ణయంపై డ్రాగన్ దేశపు మీడియా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.