లోక్ సభ ఎన్నికల ప్రచారంలో

SMTV Desk 2019-04-16 16:17:09  Chandrababu naidu,

అమరావతి: ఏపీలో పోలింగ్‌లో ముగియడంతో ఇక దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. బీజేపీయేతర పార్టీలకు మద్దతి ఇస్తున్న ఆయన మిత్ర ధర్మంలో భాగంగా పొరుగు రాష్ట్రాలకు వెళ్లి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. సోమవారం కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి తరఫున ప్రచారం చేసిన చంద్రబాబు ఇవాళ తమిళనాట రాజకీయ సభల్లో పాల్గొంటారు. డీఎంకే పార్టీకి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి మద్దతుగా నిలవాలని చంద్రబాబు తమిళనాడులో ఉంటున్న తెలుగుప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు ప్రచారం నిర్వహించే అవకాశముందని అంటున్నారు. చంద్రబాబు వెంట ఎంపీ సీఎం రమేశ్ కూడా చెన్నైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రచారం అనంతరం మధ్యాహ్నం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఈవీఎంల లోపాలపై మరోసారి నేషనల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్న చంద్రబాబు ఈవీఎంలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో తమతో కలిసి రావాల్సిందిగా స్టాలిన్‌ను కోరనున్నారు చంద్రబాబు.