పని చేసే ప్రభుత్వానికే ప్రజలు పట్టంకట్టబోతున్నారు : గంటా

SMTV Desk 2019-04-16 15:01:20  ap minister, ganta srinivasarao, tdp, chandrababu, ap elections

విశాఖపట్నం: టిడిపి మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఎన్నికల్లో తమదే ఘన విజయం అని ధీమా వ్యక్తం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ....రాష్ట్ర ప్రజలంతా కూడా మళ్లీ పనిచేసే ప్రభుత్వానికే పట్టంకట్టబోతున్నారని, 125 సీట్లతో టిడిపి గెలవబోతుందని అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 37 వార్డు 209 బూత్‌లో అర్ధరాత్రి 2 గంటల వరకూ పోలింగ్ జరిగిందన్నారు. అధికారులను మార్చి రాష్ట్రంలో భయాన్ని సృష్టించారని ఆరోపించారు. పోలింగ్ రోజు ఓటర్ల స్పందన ప్రజాస్వామ్యంపై వారి బాధ్యతకు నిదర్శనమన్నారు. ఏర్పాట్లలో లోపాలపై స్వయంగా ఎన్నికల కమిషనర్ ఒప్పుకున్నారని తెలిపారు. భద్రత ఇవ్వలేకపోయామని.. ఓట్లు గల్లంతు నిజమేనని ద్వివేది ఒప్పుకున్నారని వెల్లడించారు.