ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా‌గ్రామ్‌, వాట్సప్ లు డౌన్

SMTV Desk 2019-04-16 14:27:40  whats app, Instagram, Facebook, twitter, social media sites down

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సోషల్ మీడియాలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా‌గ్రామ్‌, వాట్సప్ లు డౌన్ అయ్యాయి. డెస్క్ ‌టాప్ వెర్షన్లలో ఫేస్‌బుక్ పనిచేయడం లేదంటూ పెద్ద ఎత్తున ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. ఫేస్‌బుక్‌తో పాటు ఆ సంస్థకు చెందిన వాట్సప్, ఇన్‌స్టా‌గ్రామ్‌లు కూడా సరిగ్గా పనిచేయడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. భారత్‌లో కూడా ఫేస్‌బుక్ డౌన్ అయింది. ఒక్క భారత్‌లో మాత్రమే కాకుండా అమెరికా, మలేసియా, టర్కీ లాంటి దేశాల్లో కూడా ఫేస్‌బుక్ డౌన్ అయినట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ల డౌన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత నెలలో కూడా ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లు డౌన్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి ఇలా జరిగింది. దీంతో చాలా మంది యూజర్లు తమ అనుభవాలను ట్విట్టర్‌లో పంచుకుంటున్నారు.