ఆలయంలో నిత్యాన్నదానం కోసం పవన్ రూ.1.32కోట్ల విరాళం

SMTV Desk 2019-04-14 11:25:55  janasena chief pawan kalyan, pawan kalyan, guntur ditrict pedakakani mandal namburu village,dashavatara venkateshwara swamy temple

గుంటూరు: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ నిత్యాన్నదానం కోసం రూ.1.32కోట్లను అందించారు. పవన్ కల్యాణ్ ఈ రోజు దశావతార వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ధర్మకర్తలు ఘన స్వాగతం పలికి గుడిలోపలికి తీసుకెళ్లారు. పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్‌, అంజిబాబులతో కలసి వచ్చిన పవన్.. వెంకన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు. గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయంలో నిత్యాన్నదానం కోసం జనసేన అధినేత రూ.1.32కోట్లను అందించారు. తర్వత అన్నదానాన్ని ప్రారంభించి భక్తులకు స్వయంగా వడ్డించారు.