పోలింగ్ ముగియగానే యాగం జరిపించిన రోజా

SMTV Desk 2019-04-12 18:03:21  nagari mla, ysrcp roja, ap poll

నగరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, తాజాగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆర్కే రోజా, పోలింగ్ ముగియగానే, పార్టీ విజయాన్ని ఆకాంక్షిస్తూ, సుదర్శనయాగం నిర్వహించారు. ఏడుగురు రుత్విక్కులతో ఆమె యాగం జరిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాలు తమ పార్టీకే అనుకూలంగా రానున్నాయని, ప్రజాబలంతో పాటు దైవబలం కూడా తోడు కావాలన్న ఆలోచనతోనే యాగం జరిపిస్తున్నానని తెలిపారు. ఈ ఎన్నికల్లో తనకు అత్యధిక మెజారిటీ వస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. సుదర్శనయాగంలో రోజా కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. యాగం అనంతరం వేద పండితులు రోజాను ఆశీర్వదించారు.