గల్లా జయదేవ్‌ ఆఫీసుల్లో ఐటీ తనిఖీలు

SMTV Desk 2019-04-11 11:50:53  tdp mp galla jayadev, trs, kcr, bjp, narendra modi, deta scam, income tax officers

హైదరాబాద్‌: మంగళవారం టిడిపి ఎంపీ గల్లా జయదేవ్‌ ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2014 ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన తన ఆస్తులు 680 కోట్లుగా ఉన్నట్లు పేర్కోన్నారు. ఐటిశాఖ సోదాలు చేపట్టడంతో గుంటూరులోని పట్టాభిపురంలో టిడిపి నేతలతో కలిసి జయదేవ్‌ రాత్రి ధర్నాకు దిగారు. టిడిపిని ఎందుకు టార్గెట్‌ చేశారు. ఎన్నికలపై మోది ప్రభావం ఉండాలనే ఇలా చేస్తున్నారని, దేశం ఎమర్జెన్సీ వైపుగా వెళ్తోందని జయదేవ్‌ ఆరోపించారు. జయదేవ్‌ కంపెనీలో చీఫ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న గుర్రప్పనాయుడు ఇంట్లో మంగళవారం సాయంత్రం ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. అక్కడ 30 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.