ఆంధ్రులను పచ్చి బూతులు తిట్టిన కేసీఆర్ చెబితే ఆంధ్రులు ఓట్లేసేస్తారా?

SMTV Desk 2019-04-09 17:13:04  kcr, pawan kalyan, ysrcp, ys jagan mohan reddy, janasena

అమరావతి: ఎన్నికల సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏపి రాష్ట్రనికి జగన్‌ సిఎం ఎప్పటికి కాలేడని ఆయన జోస్యం చెప్పారు. కెసిఆర్‌ది లక్కీ హ్యాండ్‌ కదా 2014లోజగన్‌ సిఎం అవుతాడని కెసిఆర్‌ అన్నారు. కానీ ఏం జరిగింది. ఆయన చెబితే జగన్ ముఖ్యమంత్రి అవుతారా? ఆంధ్రులను పచ్చి బూతులు తిట్టిన కేసీఆర్ చెబితే ఆంధ్రులు ఓట్లేసేస్తారా? తెలంగాణ ఉద్యమంలో ధర్మం ఉంది కాబట్టే.. తెలంగాణ వరకు కేసీఆర్ ధర్మం పనిచేసింది. ఇక్కడ మాత్రం జగన్ వెంట నడిస్తే అధర్మం అవుతుంది. యాదాద్రి నరసింహ స్వామి కూడా ఒప్పుకోడు. చండీ కూడా ఒప్పుకోదు. ఆ విషయం కేసీఆర్‌కు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే.. పెద్దమనిషి అనాలి కాబట్టి అంటున్నారు. ఇప్పుడే కాదు జగన్ ఎప్పటికీ సీఎం కాలేరు. అంటూ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.