ఫ్రీగా ఏటీఎంలు పంచిపెడుతున్న వైసీపీ అభ్యర్థి

SMTV Desk 2019-04-09 15:36:40  malla vijayaprasad distributes free atms, vishakapatnam, ysrcp

విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మళ్ల విజయప్రసాద్ అక్కడి ప్రజలకు ఫ్రీగా ఏటీఎంలు పంచిపెడుతున్నారు. అయితే ఈ ఏటీఎంలు డబ్బులు డ్రా చేసుకునేందుకు కాదంట వీటి పేరు ‘ఏనీ టైం మళ్ల’. ఈ కార్డు వ్యాలిడీటీ 2019 నుంచి 2024 వరకు మాత్రమే. ఇందులో డబ్బులకు బదులు.. టోల్ ఫ్రీ నెంబరు ఉంటుంది. 18005994466కు ఫోన్‌ చేస్తే ‘ఎనీ టైం మళ్ళ’ అందుబాటులో వుంటారని తెలుపుతున్నారు. వీటిని నియోజక వర్గంలో వున్న 2 లక్షలకు పైగా ఓటర్లకు, కార్యకర్తలు పంపిణీ చేయడం గమనార్హం. వారెవ్వా బాగుంది పొండి మీ ఓట్లు రాబట్టే విద్య అంటున్నారు స్థానికులు.