డ్రామాలు చేయడం టిడిపి నేతలుకు కొత్తేం కాదు!

SMTV Desk 2019-04-09 11:07:12  GVL Narashimha rao, BJP, AP Governament, TDP, Chandrababu

విజయవాడ: ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు విజయవాడలోని బిజెపి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ...టిడిపి నేతలకు ఓటమి భయం పట్టుకుందనీ, అందుకే ప్రజలను మభ్య పెట్టడానికి కొత్త నాటకాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు. సీఎం రమేశ్ కావాలనే పోలీసులతో తన ఇంటిపై దాడులు చేయించుకున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల పత్రిక బయటపెట్టిందని వ్యాఖ్యానించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా డ్రామాలు ఆడినందుకు సీఎం రమేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రమేశ్ డ్రామాలపై ఎన్నికల సంఘం విచారణ జరపాలన్నారు. ప్రజలను మోసంచేసిన టిడిపికి గట్టిగా బుద్ధి చెప్పాలని జీవీఎల్ పిలుపునిచ్చారు. డ్రామాలు చేయడంటిడిపి నేతలుకు కొత్తేం కాదని విమర్శించారు. నేతలుకు కొత్తేం కాదని విమర్శించారు.