అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా...

SMTV Desk 2019-04-08 13:03:11  PSPK, janasena

సత్తెనపల్లి, తెనాలి సభలు రద్దయ్యాయి. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఆయన ఎండవేడిమికి తట్టుకోలేక కళ్లుతిరిగి పడిపోయారు. దాంతో పవన్ ను ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం రాత్రి పొద్దుపోయాక డిశ్చార్జ్ అయ్యారు. అయితే, ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో పవన్ తెనాలి లో ఎన్నికల ప్రచారానికి హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు.

వడదెబ్బ నుంచి కోలుకున్న పవన్ నిన్న రాత్రి తెనాలిలో రోడ్ షో నిర్వహించారు. పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రచారం కోసం వచ్చిన పవన్ కల్యాణ్ చేతికి సెలైన్ ఎక్కించే సూది అలాగే ఉంది. దాన్నిబట్టి ఆయన పూర్తిగా కోలుకోకుండానే చికిత్స మధ్యలోనే ప్రచారానికి వచ్చినట్టు అర్థమవుతోంది. ఎన్నికల ప్రచారం మరికొన్నిరోజుల్లో ముగియనుండడంతో అభ్యర్థుల కోసం ఆయన అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా వచ్చినట్టు జనసైనికులు చెబుతున్నారు.