మార్కెట్లోకి జీప్‌ కంపాస్‌ స్పోర్ట్స్‌ ప్లస్‌

SMTV Desk 2019-04-04 18:48:52  Jeep Compass Sport Plus, 2019-Jeep-Compass-VLP-PromoTiles,

ముంబై : జీప్‌ కంపాస్‌ స్పోర్ట్స్‌ ప్లస్‌ తాజాగా మార్కెట్లోకి విడుదలయ్యింది. దీంట్లో 16 అంగుళాల వీల్స్‌, రియర్‌ పార్కింగ్‌ సెన్సార్‌, డ్యూయల్‌జోన్‌ ఆటో ఎయిర్‌కండీషన్‌, బ్లాక్‌ రూఫ్‌ రైల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కారులో ఎలక్ట్రిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌, నాలుగు చక్రాలకు డిస్క్‌ బ్రేకులు ఉన్నాయి. రెండు రకాల ఇంజిన్లు దీని ప్రత్యేకత. 2.0 మల్టీజెట్‌ ఇంజిన్‌, 6 స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌లలో లభిస్తుంది. మరో వేరియంట్‌లో 1.4 లీటర్‌ మల్టీ ఎయిర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ 6 స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో రానుంది. దీని ధర సుమారు రూ.16 లక్షలుగా నిర్ణయించారు.