ఎంపీ మురళీమోహన్‌పై కేసు...రూ.2కోట్లు స్వాధీనం

SMTV Desk 2019-04-04 18:46:34  mp murali mohan, election commission, police case

హైదరాబాద్‌ : ఎంపీ మురళీ మోహన్‌పై సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మురళీమోహన్‌తో సహా నిందితులపై ఐపీసీ 171బీ,సీ,ఎఫ్‌ సెక్షన కేసు నమోదు చేసినట్లు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 21 చెక్‌పొస్టులు ఏర్పాటు చేశామని, హైటెక్‌సిటి రైల్వే సేటషన్‌లో నిన్న రాత్రి ఇద్దరి పై అనుమానం వచ్చింది నిమలూరు శ్రీహరి ఆవూరి పండరిలను అదుపులోకి తీసుకున్నాం.ఇద్దరు రెండు బ్యాగులో రూ.2కోట్లు తీసుకెళుతున్నారు యలమంచలి మురళీమోహన్‌కు ఇచేందుకు తీసుకెళున్నట్లు తెలిపారు. ఈ కేసులో మోత్తం ఆరుగురి పై కేసు నమోదు చేశం.నిమ్మలూరు శ్రీహరి,పండరి,జగన్‌,ధర్మరాజు,మురళీకృష్ణ,ఎంపీ మురళీ మోహన్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.జయభేరి సంస్థకు చెందిన నగదుగా గుర్తించామన్నారు.