ఆపిల్ బంపర్ ఆఫర్

SMTV Desk 2019-04-04 18:43:32  apple, apple smartphone, iphone xr

న్యూఢిల్లీ : ఆపిల్ ఫోన్ ప్రియులకు ఆ కంపెనీ ఓ శుభవార్త ప్రకటించింది. ఏప్రిల్‌ 5 నుంచి ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ మోడల్‌లోని అన్ని వేరియంట్ల ధరపై రూ.17,000 తగ్గించింది. ప్రస్తుతం ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌(64జీబీ) ధర రూ. 76,900గా ఉంది. డిస్కౌంట్‌పై ఇది రూ. 59,900కే రానుంది. ఇక 128 జీబీ ఎక్స్‌ఆర్‌ ధర రూ. 81,900 నుంచి రూ. 64,900కు తగ్గనుంది. ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌(256జీబీ) ధర రూ. 91,900 నుంచి రూ. 74,900లకు దిగిరానుంది. అంతేగాక.. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుతో కొనుగోలు చేసిన వారికి మరో 10శాతం అదనపు రాయితీ లభిస్తుందని కంపెనీ తెలిపింది. అయితే ఇది కేవలం పరిమితకాల ప్రమోషనల్‌ ఆఫర్‌ మాత్రమేనని, శాశ్వత ధర తగ్గింపు కాదని కంపెనీ స్పష్టం చేసింది.