అమెరికా అధ్యక్ష పదవికి భారత సంతతి మహిళ పోటీ

SMTV Desk 2019-04-04 17:07:54  Kamala Harris, Indian-American senator , Donald Trump should resign,

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష పదవికి భారత సంతతి మహిళ కమలా హారిస్ పోటీ పడుతున్నారు. అయితే ఈమెకు అక్కడ రోజురోజుకి మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తొలిదశ ప్రెసిడెన్షియల్ ప్రచారం ముగింపుకు వచ్చేసరికి ఆమెకు భారీగా విరాళాలు అందాయి. ప్రైవేటు సంస్థల నుంచి ఒక్కపైసా కూడా తీసుకునేది లేదన్న కమలాకు.. 2లక్షల 18వేల మంది డోనేషన్స్‌ అందించారు. అనుకున్న దానికంటే ఎక్కువ విరాళాలు వచ్చి పడుతున్నాయి. ఇక ప్రజలకు మెరుగైన వైద్యం, కనీస వేతనం పెంపు, ప్రభుత్వ టీచర్ల జీతం పెంపు వంటి హామీలతో ఆమె ప్రచారంలో దూసుకుపోతున్నారు.