నా బాస్ సీఎం కావాలి ... బండ్ల గణేష్

SMTV Desk 2019-04-04 17:02:27  Bandla ganesh, Pawan kalyan

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి నానా హంగామా సృష్టించిన బండ్ల గణేశ్... తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే బ్లేడ్‌తో గొంతు కోసుకుంటానంటూ శపథం కూడా చేశాడు. ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో... ఏదో అలా అంటాం అంటూ ఒట్టు తీసి గట్టు మీద పెట్టేశాడు. ఆ తరువాత తెలంగాణ కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ వచ్చిన బండ్ల గణేశ్... తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటూ కామెంట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిజాయితీకి నిలువుటద్దం, మానవత్వానికి ప్రతిరూపం, మంచితనానికి మరో పేరు, నా దైవం, నా బాస్ పవన్ కళ్యాణ్‌ను ఏపీ సీఎంగా చూడాలని ఉందని ట్వీట్ చేశాడు. దీంతో మరోసారి బండ్ల గణేశ్... కాంగ్రెస్ మీద అభిమానాన్ని పక్కనపెట్టి పవన్ కళ్యాణ్ మీద భక్తిని పెంచుకున్నాడనే గుసగుసలు మొదలయ్యాయి.