ఎపికి ప్రత్యేక హోదా ఇస్తాం

SMTV Desk 2019-04-04 16:38:27  Ap, Special Status, mayavati,

విశాఖ : వచ్చే ఎపి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధించి తీరుతుందని బిఎస్ పి అధినేత్రి మాయావతి ధీమా వ్యక్తం చేశారు. ఎపికి కాబోయే సిఎం జన సేన చీఫ్ పవన్ కల్యాణ్ అని ఆమె స్పష్టం చేశారు. విశాఖలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎపికి ప్రత్యేక హోదా కలిపిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కాంగ్రెస్, బిజెపిలు ఘోరంగా విఫలమయ్యాయని ఆమె పేర్కొన్నారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వకుండానే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిందని ఆమె దుయ్యబట్టారు. 2014లో బిజెపి ఎన్నో హామీలు ఇచ్చిందని, అయితే ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆమె ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాతనే తాను ప్రధాని అవుతానో, లేదో తెలుస్తుందని ఆమె తేల్చి చెప్పారు. యుపి సిఎంగా నాలుగు సార్లు పని చేశానని ఆమె తెలిపారు. మాయావతి ప్రధాని కావాలన్నది తన జీవిత కల అని పవన్ కల్యాణ్ తెలిపారు. ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా వచ్చే ఎన్నికల్లతో తమ కూటమికే ఓటేయాలని పవన్ ప్రజలను కోరారు.