తిరుపతిలో బహుమతులు గెలిచిన ఏపీ శకటాలు

SMTV Desk 2017-08-15 11:17:10  71st Independence at Tirupati, Ap Chief minister, Ap Govt

తిరుపతి, ఆగస్ట్ 15: భారత 71వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం తొలిసారిగా తిరుపతిలో వేడుకలు నిర్వహించింది. అయితే ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖలకు సంబంధించిన శకటాలు ఆద్యంతం చూపరులను ఆకట్టుకున్నాయి. కాగా, ప్రేక్షకులను అలరించిన శకటాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బహుమతులను అందించారు. రాష్ట్ర అటవీ శాఖ అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను తెలియజేసే విధంగా రూపొందించిన అటవీ శాఖ శకటానికి మొదటి బహుమతి ప్రధానం చేశారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను ప్రతిబింబించేలా తయారు చేసిన నీటి పారుదల శాఖకు రెండవ బహుమతి లభించింది. విద్యాశాఖ శకటం తృతీయ బహుమతి గెలుచుకుంది.