వైసీపీ లోకి మరో టీడీపీ నేత

SMTV Desk 2019-03-30 18:58:57  ycp, tdp,

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ మరో సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీని వీడారు. ఈసారి కోడుమూరు టికెట్ ను చంద్రబాబు తనకు కేటాయించకపోవడంతో మనస్తాపం చెందిన ఎమ్మెల్యే మణిగాంధీ వైసీపీలో చేరారు. కర్నూలు జిల్లాలోని కోడుమూరులో జగన్ సమక్షంలో ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మణిగాంధీకి కండువా కప్పిన జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో మణిగాంధీ వైసీపీ టికెట్ పై గెలుపొందారు. అనంతరం టీడీపీలోకి ఫిరాయించారు. అయితే రాజకీయ సమీకరణాల్లో భాగంగా కోడుమూరు టికెట్ ను చంద్రబాబు బి.రామాంజనేయులుకు కేటాయించారు. దీంతో మనస్తాపం చెందిన మణిగాంధీ ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, కోడుమూరు నుంచి వైసీపీ తరఫున పోటీచేస్తున్న డా.సుధాకర్ బాబు మణిగాంధీకి స్వయానా తోడల్లుడు కావడం గమనార్హం.