ఇస్రో మాజీ చైర్మన్‌కు బెదిరింపులు

SMTV Desk 2019-03-30 12:07:15  Isro,

తిరువనంతపురం : భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మాజీ చైర్మన్‌, బిజెపి నేత మాధవన్‌ నాయర్‌కు బెదిరింపు లేఖ వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వొద్దని, మోడీకి మద్దతిస్తే నాయర్‌ను చంపేస్తామని లేఖలో పేర్కొన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ లేఖ జైషే ఉగ్రవాద సంస్థ నుంచి వచ్చినట్లు నిఘా వర్గాలు నిర్ధారించాయి. ఈ బెదిరింపు లేఖ గురించి తనకు తెలియదని మాధవన్ చెప్పారు. ఈ బెదిరింపు లేఖపై నిఘా వర్గాలకు సమాచారం ఉన్నట్లు తనకు తెలిపారని పేర్కొన్నారు. నాయర్‌కు వచ్చిన బెదిరింపు లేఖపై కేరళ పోలీసులు స్పందించారు. దీనిపై వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇస్రో చైర్మన్‌గా 2009లో మాధవన్‌ నాయర్‌ పదవీ విరమణ చేశారు. దేశానికి మాధవన్ చేసిన సేవలను గుర్తించిన కేంద్రం ఆయనకు పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌ పురస్కారాలను ప్రదానం చేసింది. గతేడాది అక్టోబర్‌లో ఆయన బిజెపిలో చేరారు.