ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

SMTV Desk 2019-03-29 11:17:19  ap cm,

విజయవాడ: ఈవీఎంలలో అక్రమాలు జరిగే అవకాశాలున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడన చంద్రబాబు ఈవీఎంల విషయంలో సాధారణ ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వీవీప్యాట్లలో ఉండే స్లిప్పులను ఎందుకు లెక్కించరు? మీకొచ్చిన ఇబ్బంది ఏంటి? ఎందుకు బుకాయిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. నరేంద్ర మోదీ, కేసీఆర్, జగన్ వంటి దుర్మార్గులందరూ కలిసి రాష్ట్రంపై పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను అందరివాడ్నని, కొందరివాడ్ని కాదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈ ఎన్నికల్లో మనకు అడ్డుపడుతున్నది టీఆర్ఎస్ అని అన్నారు. టీఆర్ఎస్ ఏ టీమ్ అయితే కోడికత్తి పార్టీ బీ టీమ్ అని ఆరోపించారు.