అబద్దాలను అందంగా చెప్పగల ఘనత ఆయనకే సొంతం!!

SMTV Desk 2017-08-13 14:09:50  KVP RamachandraRao, Ap CM, Chandrababu, Polavaram project

అమరావతి, ఆగస్ట్ 13: అబద్దాలను అందంగా చెప్పగల ఘనత ఏపీ సీఎం చంద్రబాబు సొంతం, ఆయనకున్న ఆర్థిక శాస్త్రంలో ప్రావీణ్యతను రాష్ట్రాభివృద్ధికి ఉపయోగిస్తే మంచిదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు అన్నారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు నీరందిస్తే కనుక చంద్రబాబుకు అపర భగీరథుడు అనే బిరుదు ఇప్పిస్తానని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడే 2004కు ముందు పోలవరానికి అడ్డుపడింది, ఈ ప్రాజెక్టు విషయంలో ఆయన చేసింది శూన్యమని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నానని కనుక నిరూపిస్తే, రాజకీయాల నుంచి తాను శాశ్వతంగా తప్పుకుంటానని కేవీపీ సవాల్ చేశారు.