కేసీఆర్.. నీ భిక్ష మాకొద్దు. కావాలంటే నేనే నీకు రూ.500కోట్లిస్తా’

SMTV Desk 2019-03-28 16:18:21  KCR, chandrababu naidu

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్రంగా మండిపడ్దారు ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ డెవలప్‌మెంట్ చూసి ఓర్వలేకపోతున్న ఆయన.. జగన్‌తో కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మన రాష్ట్రానికి రావాల్సిన లక్షల కోట్ల ఆస్తులను కొట్టేసిన కేసీఆర్.. అమరావతి నిర్మాణానికి రూ.500కోట్లు ఇద్దామనుకున్నానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

‘అమరావతికి శంకుస్థాపనకు వచ్చిన కేసీఆర్ రూ.500కోట్లు ఇద్దామని అనుకున్నారట. ప్రధాని మోదీ ఏమీ ఇవ్వకపోవడంతో తాను కూడా ఇవ్వకుండానే వెళ్లిపోయారట. కేసీఆర్.. నీ భిక్ష మాకొద్దు. కావాలంటే నేనే నీకు రూ.500కోట్లిస్తా’ అంటూ చంద్రబాబు విమర్శించారు. మోదీ, కేసీఆర్ పంపించిన సొమ్మును వైసీపీ అధినేత‌ వైఎస్ జగన్ నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున పంపిణీ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.