కేటీఆర్‌తో చంద్రబాబు పొత్తు కోసం మంతనాలు జరపలేదా

SMTV Desk 2019-03-26 13:08:50  jagan, chandra babu, KTR.

నేడు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపై జగన్ విమర్శలు చేశారు. చంద్రబాబుది అందితే జట్టు అందకపోతే కాళ్లు అని అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని అన్నారు. నాడు కేటీఆర్‌తో చంద్రబాబు పొత్తు కోసం మంతనాలు జరపలేదా? అని ప్రశ్నించారు.

కేసీఆర్ మద్దతిస్తుందని తమ పార్టీకి కాదని, ప్రత్యేక హోదా కోసం అని జగన్ అన్నారు. తన పాలన చూపించి ఓట్లు అడగలేని చంద్రబాబు, వైసీపీ అధికారంలోకి వస్తే ఏదో జరిగిపోతుందని కథలు చెబుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ఓట్లు చీల్చేందుకు తమ పార్టీ గుర్తు, కండువాలను పోలి ఉండేలా కొత్త పార్టీలను చంద్రబాబు పెట్టిస్తున్నారని జగన్ ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని, అసత్య ప్రచారాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు