మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తీసుకెళ్లడం ఎలా సాధ్యం.. లోకేశ్ వ్యాఖ్యలు వైరల్

SMTV Desk 2019-03-25 13:25:16  Nara Lokesh

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి తనయుడు, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ మళ్లీ పొరబడ్డారు. ఆదివారం మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారంలో కేసీఆర్‌ ని విమర్శించే క్రమంలో లోకేశ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేసీఆర్ ఏపీకి వస్తున్నారంటే కారణాలు రెండే రెండు. ఆయన పోలవరం ప్రాజెక్టును ఆపాలని చూస్తున్నారు. ముంపు మండలాలను మళ్లీ వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

అంతే కాదు ఇక్కడున్న మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తీసుకెళ్లడానికి కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారని లోకేశ్ వ్యాఖ్యానించారు. లోకేశ్ వ్యాఖ్యలు కాసేపట్లోనే వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు పంచ్‌లు వేస్తున్నారు. మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తీసుకెళ్లడం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారం మొదలయ్యాక లోకేష్ చాలా సార్లు మాట తూలరు. ఇటీవల వివేకానంద హత్య విషయమై మాట్లాడుతూ పరశించాం అన్న లోకేశ్, ఏప్రిల్ 9న టీడీపీకి ఓటేయ్యండంటూ మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. లోకేశ్ టంగ్ స్లిప్ ను వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకుంటోంది.