టీడీపీకి బిగ్ షాక్

SMTV Desk 2019-03-25 11:53:02  tdp, chandra babu,

ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్ది అధికార పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే అనేకమంది నాయకులు టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. తాజాగా మరో మంత్రి కూడా అదే బాటలో పయనిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుు మాజీ మంత్రి అయిన కొత్తపల్లి సుబ్బారాయుడు మళ్లీ వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. గతంలో 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఆయన ... టీడీపీలోకి వెళ్లారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆయనకు కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించింది. జరగనున్న ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు అంశంలో మనస్తాపానికి గురైన కొత్తపల్లి కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్తపల్లి ఇప్పటికే వైసీపీ అధినేత జగన్‌తో పాటు ఆ పార్టీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజుతో చర్చలు జరిపారని కూడా సమాచారం. టీడీపీకి రాజీనామా చేసి సుబ్బరాయుడు సోమవారం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈసారి ఎన్నికల్లో కొత్తపల్లి టీడీపీ నుంచి నరసాపురం టికెట్ ను ఆశించారు. కానీ చంద్రబాబు ఆ టికెట్ ను మరొకరికి కేటాయించారు. టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన మంగళవారం మధ్యాహ్నం కార్పొరేషన్ పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే అనుచరులు, కుటుంబీకులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని సుబ్బరాయుడు తెలిపారు. నరసాపురం నుంచి 2004లో టీడీపీ తరఫున పోటీచేసి గెలిచిన కొత్తపల్లి.. 2009లో పీఆర్పీ నుంచి పోటీచేసి ఓటమిచెందారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. అనంతరం టీడీపీ తీర్థం పుచ్చుకుని కార్పొరేషన్ పదవి దక్కించుకున్నారు.