అందుకే ట్రంప్ అలా అనుంటారా...

SMTV Desk 2017-08-11 14:52:49  Trump, USA fights North Korea, North Korea, weapon sales

అమెరికా, ఆగస్ట్ 11: ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఉత్తరకొరియాపై యుద్ధానికి సిద్ధం అనే వ్యాఖ్యలకు అమెరికా అంతటా, మిత్ర దేశాల్లో విశేషత చేకూరింది. ఈ నేపధ్యంలో అమెరికా ఆయుధ తయారీ కంపెనీల లాభాలు ఒక్కసారిగా పెరిగాయి. యుద్ధం వ‌స్తుందేమోన‌ని అమెరికా మిత్ర దేశాల‌న్నీ ఆయుధాలు కొనుగోళ్లను ముమ్మరం చేయడంతో ఈ పెరుగుదల సంభవించినట్లు సమాచారం. మరొవైపు అమెరికా సంస్థలకు లాభాలు తెచ్చిపెట్టడం కోసమే అధ్యక్షుడు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అప్పట్లో సిరియా దాడులకు ముందు కూడా ఇలానే అమ్మకాలు పెరిగాయని కంపెనీలు చెప్తున్నా యి.