మేనిఫెస్టో నేడు విడుదల

SMTV Desk 2019-03-23 13:44:13  TDP, chandra babu

ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న టీడీపీ మేనిఫెస్టో మరి కొద్ది సేపటిలో విడుదల కానుంది. ఇప్పటికే రెండు సార్లువిడుదల వాయిదా పడిన మేనిఫెస్టో నేడు విడుదల చేయనున్నారు. వాస్తవానికి గురువారమే మేనిఫెస్టోని విడుదల చేయాలనుకున్నా సంక్షేమాలపై మరింత ఫోకస్‌ చేయాలంటూ అధినేత ఆదేశించడంతో ఆ దిశగా మేనిఫెస్టో స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేసింది.

దానికి నిన్నటికి ఒక రూపు ఇవ్వగా దానిని సమీక్షించిన చంద్రబాబు మార్పులు చేర్పులు చేసి నేడు ఉదయం 10 గంటలకు మేనిఫెస్టోను చంద్రబాబు ప్రకటించనున్నారు. మంత్రి యనమల నేతృత్వంలో కమిటీ ఈ మేనిఫెస్టోకు రూపకల్పన చేసింది. ఓటర్లను ఆకట్టుకునేలా సంక్షేమ పథకాలతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలపైనా అధికంగా ఫోకస్‌ చేసినట్టు తెలుస్తోంది.