వ్యాపార ప్రయోజనాల కోసమే మోహన్‌బాబు విద్యాసంస్థలు నడుపుతున్నారు : కుటుంబరావు

SMTV Desk 2019-03-22 16:23:20  kutumbarao, mohan babu, fee reimbursement, sree vidhyanikethan

అమరావతి, మార్చ్ 22: సినీ నటుడు మోహన్‌బాబు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలు అసత్యమని ఏపి ప్రణాళి సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతు శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లింపుల్లో ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ మోహన్‌బాబు నిరసనకు దిగడంపై కుటుంబరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్షానికి ఆయన వంతపాడుతున్నారని కుటుంబరావు ఆరోపించారు. కక్ష పూరితంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఐదేళ్లలో రూ.14,510 కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇచ్చామని చెప్పారు. వ్యాపార ప్రయోజనాల కోసమే మోహన్‌బాబు విద్యాసంస్థలు నడుపుతున్నారని ఆరోపించారు.