తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని నామినేషన్ వేయనున్న నారా లోకేష్

SMTV Desk 2019-03-22 15:08:31  Nara lokesh,

ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు, ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. మంగళగిరి నుంచి ఆయన బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. నామినేషన్‌‌కు ముందు ఉండవల్లి నివాసంలో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. తండ్రి చంద్రబాబు నాయుడు తల్లి భువనేశ్వరి కాళ్లకు మొక్కి ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం భార్య బ్రాహ్మణీ కొబ్బరి కాయతో దిష్టి తీసి నారా లోకేష్‌కు ఎదురు వచ్చారు.సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. అనంతరం లోకేష్ నామినేషన్ వేసేందుకు మంగళగిరికి నారా లోకేష్ భారీ ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. ఆయన తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తెదేపా కంచుకోటలను కాదని ఆయన్ను ఇక్కడ నుండి పోటీకి దిమ్పుతోంది అధిష్టానం. నిజానికి ఈ నియోజకవర్గంలో బీసీలదే డిసైడింగ్ ఫ్యాక్టర్, టీడీపీకి ప్రధాన పోటీదారుగా వైసీపీ నుండి ఆళ్ళ రామ కృష్ణా రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి గంజి చిరంజీవి మీద 12 వోట్ల తేడాటో గెలుపొందారు.