త‌మిళ రాజ‌కీయాలు ఎటువైపు..?

SMTV Desk 2017-08-10 18:36:44  tamil politics, kamal haasan, rajinikanth, stalin

చెన్నై, ఆగస్ట్ 10 : తమిళ రాజకీయాల్లో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకే వేదికపై రజనీకాంత్, స్టాలిన్‌, క‌మ‌ల్ హాసన్ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు ప్రతిపక్ష డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో న‌డిచే ముర‌సోలి ప‌త్రిక వార్షికోత్సవానికి ఆ పార్టీనేత స్టాలిన్‌, సినీ న‌టులు క‌మ‌ల్ హాసన్, ర‌జ‌నీకాంత్ హాజ‌ర‌య్యారు. ఆ సభకు వెళుతున్నట్లు కనీసం ఎవరికీ చెప్పకుండా రజని ఒక్కసారిగా అక్కడ ప్రత్యక్షమవడం విశేషం. ఈ సమావేశంలో స్టాలిన్, కమల్ పక్కపక్కన కూర్చోవడంతో కమల్ డీఎంకేలో చేర‌తార‌న్న వార్తలు వినిపిస్తున్నాయి. కాగా రజనీకాంత్ కొత్త పార్టీ గురించి మరికొన్ని రోజుల్లోనే ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ఉహాగానాలు వినిపిస్తున్నాయి.