జేసీకి సవాల్ విసిరిన వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు కొత్త చిక్కులు

SMTV Desk 2019-03-21 13:44:35  jc divakar reddy, ys jagan mohan reddy, tdp, ysrcp, hindupuram, gorantla madhav, assembly elections

హిందూపురం, మార్చ్ 20: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సవాలు విసిరి, మీసం తిప్పి తన ఉద్యోగానికి రాజీనామా చేసిన వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు కొత్త చిక్కులు వచ్చిన పడ్డాయి. వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మాధవ్ కు హిందూపురం పార్లమెంట్ టికెట్ కేటాయించారు. అయితే ఆయన రాజీనామా చేసి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు మాధవ్ రాజీనామాకు డిపార్ట్మెంట్ పరంగా ఆమోదం లభించలేదు. దీంతో ఆయన ప్రభుత్వ తీరుపై కోర్టును ఆశ్రయించారు. ఈ విషయం పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. ఈ విషయం తేలకపోతే.. ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. ఈ క్రమంలో టికెట్ విషయంలో వైసీపీ అధిష్టానం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. గోరంట్ల మాధవ్ విషయం తేలకపోతే... కనీసం ఆయన భార్యని అయినా రంగంలోకి దింపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.