నెదర్లాండ్ లో కాల్పులు...ముగ్గురు మృతి

SMTV Desk 2019-03-21 11:51:05  netherland, local train, gun firing, three men died

నెదర్లాండ్, మార్చ్ 19: నెదర్లాండ్ లో ఓ వ్యక్తి ఘోరానికి పాల్పడ్డాడు. నగరంలోని యూత్రెక్ట్‌లో ఓ దుండగుడు లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణికులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో తొమ్మిది మంది గాయాలపాలయ్యారు. కాగా వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు వైద్యులు. ఈ ఘటనతో నెదర్‌లాండ్స్‌ వ్యాప్తంగా హైఅలెర్ట్‌ ప్రకటించారు. మిలటరీ పోలీసులు సైతం రంగంలోకి దిగి నిందితుడి కోసం జల్లెడ పడుతున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని టర్కీకి చెందిన గోక్‌మన్‌ తానిష్‌ గా గుర్తించారు.