బ్యాంక్ వద్ద కేఏ పాల్ హళ్ చల్

SMTV Desk 2019-03-21 11:40:59  ka paul, state bank of india, prajashanti party

విశాఖపట్నం, మార్చ్ 19: ప్రజాశాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్ డబ్బు కష్టాల్లో ఉన్నారు. ఆయన ఈ రోజు విశాఖపట్నం జైలు రోడ్డులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద డబ్బు కోసం హళ్ చల్ చేశారు. తన సొసైటీ పేరుతో ఉన్న ఖాతాలోని డబ్బులు ఇచ్చేయాలని అధికారులతో గొడవ పెట్టుకున్నారు. అయితే ఈ ఖాతాను ఫ్రీజ్ చేసి ఉండడంతో డబ్బులు ఇవ్వలేమని అధికారులు ఆయనకు వివరించారు. అయినా ఆయన పట్టించుకోకుండా, తన డబ్బులు తనకివ్వాలని డిమాండ్ చేశారు. ‘ఆ సొసైటీనే నాది. దానికి నేను అధ్యక్షుడి. కోర్టు కూడా ఈ విషయం స్పష్టం చేసింది.. ’ ని చెప్పారు. దానితో తమకు సంబంధం లేదని, పై అధికారులు ఆదేశిస్తే డబ్బులు ఇస్తామని బ్యాంకు సిబ్బంది ఆయనకు నచ్చజెప్పారు. చేసేదేమీలేక పాల్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.