ఏపీ ముఖ్యమంత్రి, గవర్నర్ డాన్స్ చేసిన వేళ....

SMTV Desk 2017-08-09 18:01:58  International Day of the Worlds Indigenous People, Ap chief minister, AP governer, Chandrababu naidu

అరకులోయ, ఆగస్ట్ 9: నేడు అరకులోయ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదివాసి దినోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గిరిజనులు తయారు చేసే ఆహార ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. అక్కడి గిరిజన యువతులు సంప్రదాయ థింసా నృత్యం చేస్తుంటే, వారి చేతులు పట్టుకుని చంద్రబాబు కూడా ఆ నృత్యంలో పాలుపంచుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు గవర్నర్ నరసింహన్ కూడా నృత్యం చేశారు. గవర్నర్ నరసింహన్‌కు ఇక్కడి అందాలు చాలా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించాయని పేర్కొన్నారు. ఆదివాసి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కట్టుబడి వున్నానని చెప్పారు.