తిరుపతి టిడిపి ఎంపి అభ్యర్థిని ప్రకటించిన బాబు

SMTV Desk 2019-03-19 12:08:03  chandrababu, andhrapradesh lok sabha elections, tirupathi loksabha constituency, tdp leader, panabaka lakshmi

నెల్లూరు, మార్చ్ 19: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా టీడీపీలోకి చేరిన పనబాక లక్ష్మిని తిరుపతి టిడిపి ఎంపి అభ్యర్థిగా సిఎం చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. ఇదే సమయంలో ఆదాల ప్రభాకర్‌ రెడ్డి గురించి ఆయన మాట్లాడుతూ.. ఆదాలని చూస్తే అసహ్యం వేస్తుందని, ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే పక్క పార్టీతో లాలూచీ పడ్డారని సిఎం వ్యాఖ్యానించారు. అయితే నెల్లూరు సభలో పనబాక లక్ష్మి దంతులు చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు.