భర్తకి పంపాల్సిన వీడియోను పొరపాటున ఫేస్‌బుక్ లో షేర్ చేసిన మహిళ

SMTV Desk 2019-03-18 09:29:45  woman nude video, bulgaria woman, facebook post

బల్గేరియా, మార్చి 18: పొరపాట్లు ఎంత ప్రమాదానికి దారితీస్తాయో చెప్పేందుకు ఈ ఘటన చక్కని ఉదాహరణ. బల్గేరియాలో ఉంటున్న ఓ మహిళ ఇంగ్లండ్‌లో ఉంటున్న తన భర్తకు పంపేందుకు తన నగ్న వీడియోను షూట్ చేసింది. దానిని అతడికి వ్యక్తిగతంతా పంపాల్సి ఉండగా, పొరపాటున తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేయడంతో సోషల్ మీడియా ఒక్కసారిగా వేడెక్కిపోయింది.

వీడియో పోస్ట్ కాగానే ఏకంగా రెండువేల మంది దానిని షేర్ చేసుకోగా, వందలాదిమంది దానిని డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఫేస్‌బుక్‌పై అవగాహన లేని ఆమె చేసిన పనికి బంధువులు, స్నేహితులు షాక్‌కు గురయ్యారు. వీడియో చూసిన వెంటనే డిలీట్ చేయమని చెప్పినప్పటికీ, అప్పటికే దానిని వందలాదిమంది డౌన్‌లోడ్ చేసుకోవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విషయం తెలిసిన భర్త ఆమెపై చిర్రుబుర్రులాడాడు.