ప్రపంచ పటంలో ఆమెరికాకు చెందిన దీవి కనిపించదు: ఉత్తర కొరియా

SMTV Desk 2017-08-09 11:48:54  Guam ,North Korea VS USA, USA, North Korea,

ఉత్తర కొరియా, ఆగస్ట్ 9: గత కొంతకాలంగా ఉత్తరకొరియా, అమెరికా మధ్య మాటల యుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అమెరికా క్షిపణులను కూడా పరీక్షించుకుని ఉత్తరకొరియాను తిప్పి కొట్టగలం అనే సంకేతాలను ప్రపంచానికి ప్రచారం చేసుకుంది. తాజాగా అణుబాంబు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించి దుమారం రేపింది. ఈ నేపధ్యంలో పసిఫిక్ మహా సముద్రంలోని అమెరికా అధీనంలో ఉన్న గువాం ద్వీపం తమకు 2,128 మైళ్ల దూరంలో ఉందని, ఆ ద్వీపాన్ని సర్వ నాశనం చేసి చూపిస్తామని ఉత్తర కొరియా అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. అమెరికా కనుక ఈ దాడిని అడ్డుకుంటే, తమ లక్ష్యం ఆ దేశ ప్రధాన భూభాగమే అవుతుందని హెచ్చరించారు. దేశ అధినేత ఆదేశాలు జారీ చేసిన మరుక్షణం ప్రపంచ పటంలో గువాం కనిపించదని ఆ అధికారి తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఉత్తరకొరియాను హెచ్చరించిన నేపధ్యంలో ప్రతీకారంగా ఈ ప్రకటన వెలువడినట్లు తెలుస్తుంది.