సింగపూర్, మార్చ్ 16: సింగపూర్‌కు చెందిన ఓ యువకుడు చికెన్ మీద మక్కువతో ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 450 రోజుల నుండి నాన్ స్టాప్ గా చికెన్ నే తింటూ ఉన్నాడు. ఉద్యమంలా ఆయన తింటున్న వంటకాలను చూసి అందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఉడికించిన చికెన్, కాల్చిన చికెన్.. చికెన్ పికెల్.. చికెన్ టిక్కా వంటి వాటిని అన్నంతో కలిపి తీసుకుంటున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ji fan fan’ అనే వ్యక్తి రోజుకో చికెన్ వంటకాన్ని తింటున్నాడు. 2017 సెప్టెంబర్ నుంచి రోజుకో రకమైన చికెన్ తింటూ ‘Everyday’ హ్యాష్ ట్యాగ్‌తో రోజుల సంఖ్యను పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఇలా ఇప్పటి వరకు 450 రోజులు పూర్తయ్యింది. ఇలా అతను చికెన్ తినడానికి ఏదైనా కారణం ఉందా? లేక ఇష్టంతోనే తింటున్నాడా అనేది మాత్రం ‘జి ఫాన్ ఫాన్’ చెప్పలేదు. ఇన్ని రోజుల నుంచి అతడు చికెట్ తింటుంటే అతని ఆరోగ్యం ఎలా ఉందనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఇందుకు సంబంధించిన పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.