10వ తరగతి విద్యార్థులకు శుభవార్త

SMTV Desk 2019-03-16 14:59:25  tenth class,

10వ తరగతి విద్యార్థులకు శుభవార్త. 10వ తరగతి పరీక్షలు విద్యార్థులకు ప్రతి ఏడాది లానే ఈ ఏడాది కూడా ఏ.పి.ఎస్.ఎస్.ఆర్.టి.సి బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ సంస్థ వి.సి అండ్ ఎం.డి శ్రీ ఎన్.వి సురేంద్రబాబు, ఐ.పి.ఎస్ , తేదీ.14-3-2019 గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు.

10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కేవలం హాల్ టికెట్ చూపించి తమ నివాస ప్రాంతం నుండి పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు, మళ్ళీ తిరుగు ప్రయాణానికి ఈ ఉచిత సౌకర్యం వర్తిస్తుంది. బస్సు పాసు లేకున్నా, ఇంత దూరం అనే నిబంధనలతో నిమిత్తం లేకుండా ఈ ఉచితంగా ప్రయాణం వర్తిస్తుంది. ఈ ప్రయాణం తెలుగు వెలుగు, సిటీ సబర్బన్ బస్సులలో ఉచితం కాగా, ఎక్స్ ప్రెస్ బస్సులలో ప్రయాణం చేయదలచుకున్న వారు తమ బస్సు పాసు మరియు పరీక్ష హాల్ టికెట్ చూపి, కాంబినేషన్ టికెట్ పొందడం ద్వారా, తాము పరీక్షలు రాసున్న పరీక్షా కేంద్రం వరకు ప్రయాణించవచ్చు.

ఈ ఉచిత సౌకర్యం 10వ తరగతి పరీక్షలు జరిగే తేదీల వ్యవధి వరకు మాత్రమే అమలు లో ఉంటుంది., అంటే మార్చి 18వ తేదీ మొదలు ఏప్రిల్ 3వ తేదీ వరకు పరీక్షలు జరిగే తేదీలలో ఈ ఉచిత సౌకర్యం వర్తిస్తుంది. ఈ పరీక్ష తేదీలలో ఏదైనా శెలవు దినాలు ఉన్నప్పటికి కూడా ఈ ఉచిత ప్రయాణం వర్తిస్తుంది.

ఈ విషయానికి అత్యధిక ప్రచారం కల్పించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా, ముఖ్యంగా కండక్టర్లు, డ్రైవర్లకు ఈ ఉచిత ప్రయాణం సంగతి నోటీస్ బోర్డు ద్వారా తెలపడం, గేటి మీటింగ్ ల ద్వారా తెలియచెప్పాల్సిందిగా, పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తగినన్ని బస్సులు నడుపవలసిందిగాను ఇప్పటికే అందరు రీజినల్ మేనేజర్లకు ఆదేశాలు చేయబడినవి.

రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలకు హాజరవుతున్న సుమారు 6.21 లక్షల మంది విద్యార్థులకు ఈ ఉచిత సౌకర్యం వర్తించేలా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా 2838 సెంటర్లలో ఉదయం 9-30 గంటల నుండి 12-15 గంటల మధ్య నిర్వహించనున్నారు.