పార్టీ మారను కానీ పోటీ చేయాలో లేదో ఆలోచిస్తా : జేసీ

SMTV Desk 2019-03-16 10:48:37  tdp, elections, jc divarak

అమరావతి, మార్చ్ 15: శుక్రవారం మీడియాతో సమావేశమైన ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీ మారను కానీ పోటీ చేయాలో లేదో ఆలోచిస్తానని అన్నారు. కమిటి ఆలోచనలు స్పష్టంగా లేవని విమర్శించారు.కొంతమంది నాయకుల పై అనమానాలు ఉన్నాయని కమిటీలో కొందరి మాటలు తనకు నచ్చలేదని తెలిపారు. సింగనమల,కళ్యాణదుర్గం,గుంతకల్లులో పిట్టింగులను మార్చాలని అన్నారు. సిట్టింగులను మార్చకుంటే అనంతపురం లోక్‌సభ స్థానంలో ఓటమి తప్పదని ఆయన వెల్లడించారు.