జేడీ లక్ష్మీనారాయణ మరో సంచలన ప్రకటణ

SMTV Desk 2019-03-15 09:44:26  jd lakshmi narayana, cbi, tdp, andhrapradesh assembly elections

అమరావతి, మార్చ్ 14: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మరో షాక్ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో తను ఏ పార్టీ తరపున పోటీ చేయనని, తటస్థంగా ఉంటానని సంచలన ప్రకటన చేశారు. ప్రజాసేవఎన్జీవో కార్యక్రమాల్లో బిజీగా ఉంటానని తెలిపారు. మరోవైపు, ఎన్నికల తర్వాత రాజకీయ ప్రవేశంపై ఆలోచిద్దామని తన సన్నిహితులతో లక్ష్మినారాయణ చెప్పినట్టు సమాచారం. టీడీపీ తరపున లక్ష్మినారాయణ పోటీ చేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయనతో టీడీపీ నేతలు కూడా భేటీ అయి, పార్టీలోకి ఆహ్వానించారు. అయినప్పటికే, ఎన్నికలకు దూరంగా ఉండాలని లక్ష్మినారాయణ నిర్ణయించుకున్నారు.