తైవాన్‌ విమానంకు తప్పిన పెను ప్రమాదం

SMTV Desk 2019-03-14 15:01:39  Taiwan airplane, runway , Kalibo International Airport, Civil Aviation Authority

కలిబో, మార్చ్ 14: ఫిలిప్పీన్స్‌లో మరో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. నిన్న ఫిలిప్పీన్స్‌లోని కలిబో విమానాశ్రయానికి 122 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఓ తైవాన్‌ విమానం చేరుకుంది. అయితే విమానం రన్‌వే చివర్లో మలుపు తిరుగుతుండగా గడ్డిలో చక్రం చిక్కుకుపోయింది. దీన్ని గమనించిన విమాన పైలట్‌ వెంటనే అప్రమత్తమై విమానాన్ని చాకచక్యంగా నిలిపివేశారు. ఎయిర్‌పోర్టు సిబ్బంది అక్కడకు చేరుకుని ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. అనంతరం తనిఖీల నిమిత్తం విమానాన్ని ఎయిర్‌పోర్టు టర్మినల్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.