మసూద్ అజార్‌కు అండగా చైనా?

SMTV Desk 2019-03-14 09:10:29  china, masood azhar, international criminal, terrorists, jaies eh mohammed, united nation organisation, india

బీజింగ్, మార్చ్ 13: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితిలో మరి కొద్ది గంటల్లో అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించే క్రమంలో భద్రతా మండలి మరోసారి సమావేశం కానుంది. అయితే ఈ తీర్మానాన్ని చైనా అడ్డుకునేందుకు భావిస్తున్నట్లు సమాచారం. ఇదివరకే మసూద్‌ను చైనా వీటో అధికారం ఉండటంతో గతంలో మూడు సార్లు అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించొద్దని వెల్లడించింది. సెక్యూరిటీ కౌన్సిల్ ముందుకు మసూద్ ను అంతర్జాతీయ తీవ్రవాదిగా పరిగణించాలని ఫ్రాన్స్, యుకె, అమెరికా ప్రతిపాదన తీసుకొచ్చింది. అందరికీ అమోదయోగ్యమైన పరిష్కారం ఉంటేనే తాను అంగీకరిస్తామని చైనా విదేశాంగ శాఖ అధికారి కాంగ్ పేర్కొన్నారు. మసూద్ ఆధ్వర్యంలో భారత్‌లో చాలా ఆత్మాహుతి దాడులు జరిగిన విషయం తెలిసిందే. పార్లమెంటు, పాఠాన్‌కోట్, ఉరి, తాజాగా పుల్వామా దాడి 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాలు మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాది ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. చైనా మాత్రం ఎప్పుడు మసూద్‌ను వెనకేసుకొస్తుంది.