బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే కు మరో షాక్

SMTV Desk 2019-03-13 15:17:04  theresa may, EU leaders,

లండన్‌, మార్చ్ 13: బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే ప్రవేశ పెట్టిన బ్రెగ్జిట్‌ డీల్‌ను బ్రిటన్‌ పార్లమెంట్‌ తిరస్కరించి షాక్ ఇచ్చింది. ఇంతకుముందు ఒకసారి థెరిసా మే ఈ ప్రదిపాదన పెట్టారు. ఆమె ప్రతిపాదనను అప్పుడు కూడా బ్రిటన్‌ పార్లమెంట్‌ తిరస్కరించింది. అయితే మొత్తం 391 సభ్యులున్న హౌజ్ ఆఫ్ కామన్స్ సభలో థెరెసా ప్రతిపానను 242 మంది సభ్యులు తిరస్కరించారు. ఈయూతో ఎలాంటి ఒప్పందం లేకుండానే బయటికి వచ్చే వైపే బ్రిటన్ పార్లమెంట్ మొగ్గు చూపింది. అయితే ఈయూ ఏర్పడిన 46 ఏళ్ల క్రితం ఏర్పడింది. ఈ యూనియన్‌లో కీలకంగా ఉంటూ వచ్చిన బ్రిటన్ గత ఏడాది వైదొలగనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 29వ తేదీతో ఈయూకు బ్రిటన్ శాశ్వతంగా వీడ్కోలు చెప్పనుంది.