ఉత్తర కొరియాలో 99.99 శాతం పోలింగ్!

SMTV Desk 2019-03-13 14:20:19  North Korean leader Kim Jong , north korea parliament elections

ఉత్తర కొరియా, మార్చ్ 13: ఏ దేశంలో ఎన్నికలు జరిగినా దాదాపు 50 నుంచి 70 శాతం వరకు పోలింగ్ నమోదు అవుతుంది. కాని ఉత్తర కొరియాలో మాత్రం ఊహించని విధంగా 99.99 శాతం పోలింగ్ నమోదైంది. తాజాగా పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఈ రికార్డు నమోదైంది. కోట్లాది జనం ఉండే భారత్, అమెరికా, రష్యా వంటి దేశాల్లో సైతం నమోదు కాని ఇంత శాతం ఉత్తర కొరియాలో నమోదు కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఉత్తర కొరియాలో గత ఎన్నికల్లో 99.97 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి 100 శాతం జరగాల్సి ఉండిందని, అయితే విదేశాల్లోని కొరియన్లు సకాలంలో సొంతగడ్డకు చేరకపోవడంతో అది సాధ్యం కాదని సర్కారీ మీడియా చెప్పుకొచ్చింది. అక్కడ నియోజకవర్గాల్లో ఒకరే అభ్యర్థి ఉంటారు. బ్యాలెట్ పేపర్లో ఆ అభ్యర్థి ఫొటో ఉంటుంది. ఓటర్లు ఆ వ్యక్తినే చచ్చినట్లు ఎన్నుకోవాలి. నచ్చలేదని పోలింగ్ కేంద్రానికి డుమ్మా కొట్టడం, ఒకవేళ వెళ్లినా నోటా వంటిదానికి గుద్దడం వంటి ఆప్షన్లేవీ ఉండవు. ఓటర్లు తప్పనిసరిగా ఓటేయాలి. అంతా చేస్తే, ఆ ఎన్నికైన అభ్యర్థులతో కూడిన పార్లమెంటుకు ఎలాంటి అధికారాలూ ఉండవు.