వైసీపీ ఆవిర్భవించి నేటికి తొమ్మిదేళ్లు.

SMTV Desk 2019-03-12 16:55:05  ycp,

అమరావతి, మార్చ్ 12: మహానేత ఆశయాలను, పథకాలను సజీవంగా చేందుకు వైయస్సార్ కాంగ్రెస్ ఆవిర్భవించి నేటికి తొమ్మిదేళ్లు. గత ఎనిమిదేళ్లుగా ప్రజా జీవితంలో సవాళ్లు, కష్టాలు, నష్టాలకు ఎదురొడ్డి ఈ పార్టీని భుజస్కందాల మీద మోసిన ప్రతి కుటుంబ సభ్యుడికి శుభాకాంక్షలు, వందనాలు… అంటూ వైఎస్ జగన్ ఇవాళ వైఎస్సాఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేశారు.

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైఎస్సాఆర్సీపీ), 12 మార్చి 2011 లో ఆవిర్భవించింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా వైఎస్ జగన్ ఈ పార్టీని ప్రారంభించారు. ఇడుపులపాయలో వైఎస్సాఆర్ సమాధి వద్ద.. తన తల్లి విజయమ్మతో కలిసి జగన్ పార్టీని ప్రకటించారు.

అయితే.. పార్టీ ఆవిర్భవించిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో వైఎస్సాఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయి ఏపీ, తెలంగాణగా ఆవిర్భవించిన తర్వాత వచ్చిన 2014 ఎన్నికల్లోనూ వైసీపీ… టీడీపీకి టఫ్ కాంపిటిషన్ ఇచ్చింది. చాలా తక్కువ ఓట్ల వ్యవధితో వైసీపీ ఓడిపోయింది. 2014 ఎన్నికల్లో 9 లోక్ సభ స్థానాలను గెలుచుకోవడంతో పాటు.. 67 అసెంబ్లీ స్థానాలను గెలిచి… ఏపీ ప్రతిపక్షహోదాను సాధించింది.

గతం గత: 2014 లో స్వల్ప ఓట్ల తేడాతో వైసీపీ ఓడిపోయినప్పటికీ.. మళ్లీ ఉవ్వెత్తున లేచిన కెరటంలా గత ఐదేళ్లుగా ఏపీ ప్రజల అభివృద్ధి కోసం పోరాడుతూనే ఉన్నది. వైఎస్ జగన్ నిరంతరంగా ప్రజల్లో ఉంటూ వాళ్ల సమస్యలను తెలుసుకున్నారు. ఆయన చేసిన పాదయాత్రను ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. అటువంటి సాహసం చేయడానికి కూడా చాలామంది భయపడతారు. ఎంతో సాహసం చేసి పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమై వాళ్లకు ఓ భరోసాను కల్పించిన నేత వైఎస్ జగన్. అందుకే.. జగన్ ను ముఖ్యమంత్రిని చేసి ఏపీని అభివృద్ధి చేసే భాగ్యం కల్పిస్తామని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. ఏపీని అభివృద్ధి చేయాలంటే అది జగన్ వల్లే అవుతుందని తెలుసుకున్న ఏపీ ప్రజలు… దుష్ట రాజకీయాలు చేస్తూ ఏపీ అభివృద్ధిని పట్టించుకోని చంద్రబాబును ఘోరంగా ఓడించి జగన్ కు ఓటేస్తామని మాటిస్తున్నారు.