మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించనున్న ఐక్య రాజ్య సమితి!

SMTV Desk 2019-03-12 13:00:05  united nation organaisation, india, pakistan, jaish e mohammed chief masood azhar, international criminal

న్యూయార్క్, మార్చ్ 12: ప్రపంచ దేశాలన్నీ జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. పూల్వామా దాడి తర్వాత అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ చేసిన తీర్మానంపై ఐక్య రాజ్య సమితి భద్రతామండలి బుదవారం విచారణ చేపట్టనుంది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత్‌ పలుసార్లు ఐరాసకు విజ్ఞప్తి చేసినా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. అయితే భారత్‌ వినతికి పలు దేశాలు మద్దతు తెలుపుతున్నా.. చైనా మాత్రం మోకాలడ్డుతోంది. ఇలాంటి నేపథ్యంలో యుఎన్‌వో(యునైటెడ్‌ నేషన్‌ ఆర్గనైజేషన్) రేపు తీర్పును ఇవ్వనుంది.