ఉత్తరాంధ్ర మంత్రిని వెంటనే బర్త్‌రఫ్ చేయాలి: రోజా

SMTV Desk 2017-08-07 17:50:16  YCP MLA Roja, TDP, AP Chief minister, Chandrababu Naidu

అమరావతి, ఆగష్ట్ 7: వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. సోమవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... టీడీపీ పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయింది, కాల్‌మనీ, సెక్స్‌రాకెట్‌కు కారకులు ఎవరు? అని ప్రశ్నించారు. మహిళలను హింసలకు గురిచేసే వారిని టీడీపీ వెనకేసుకువస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు మంత్రులంతా కంత్రీలు, ఎమ్మెల్యేలంతా కాలకేయుళ్లు. మహిళా సాధికారిత పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదంటూ మండిపడ్డారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉత్తరాంధ్ర మంత్రిని వెంటనే బర్త్‌రఫ్ చేయాలని, టీడీపీ నాయకులకు రాఖీ శుభాకాంక్షలు చెప్పే అర్హత కూడా లేదంటూ ఆమె తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.