ఎన్టీఆర్‌ ప్రచారం ఎవరి తరుపున...?

SMTV Desk 2019-03-10 14:18:21  Jr. NTR, Jaganmohan Reddy, Narne Srinivasa Rao, Nandamuri Suhasini, Kalyan Ram, TDP, YCP, Campaign

నసభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని పెద్ద ఎత్తునే ప్రచారం సాగింది. అయితే, ఆయన సుహాసినిని గెలిపించాలని కల్యాణ్ రామ్ తో కలిసి ఓ ప్రకటన విడుదల చేయడానికి మాత్రమే పరిమితమయ్యారు.

కాగా, నార్నే శ్రీనివాసరావు చిలకలూరిపేటలో... మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన... మంత్రి పత్తిపాటి పుల్లారావును ఢీకొనాల్సి ఉంటుంది. అయితే, కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్న ఆ నియోజకవర్గంలో అదే తరహాలో వెళ్ళాలనే ఉద్దేశంతో జగన్ ఉన్నారని, అందువల్ల నార్నేను పోటీకి దింపాలని అనుకుంటున్నారని అంటున్నారు. ఇప్పటి వరకు చిలకలూరిపేటలో కాంగ్రెస్ ఒక్కసారి మాత్రమే గెలిచింది. తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా ఉన్న చిలకలూరిపేటలో నార్నే పాగా వేయగలరా అనేది వేచి చూడాల్సిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మామను గెలిపించడానికి రంగంలోకి దిగుతారనే మాట వినిపిస్తోందిగానీ అంత నమ్మడానికి వీలు కాని పరిస్థితే ఉంది. ఎన్టీఆర్ 2009లో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశారు. ఆయనకు ప్రచారం కొత్తేమీ కాదు గానీ టీడీపిని కాదని మరో పార్టీకి ప్రచారం చేస్తారా అనేది అసలైన ప్రశ్న.